చినూరు గ్రామంలో చోరీ.. బంగారం, వెండి అపహరణ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): చినూరు గ్రామంలో రాత్రి ఓఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చినుర్ గ్రామంలో శనివారం రాత్రి గ్రామానికి చెందిన బోయిని సురేష్ తన ఇంటి తాళం వేసి కుటుంబసభ్యులతో ఉగాది సందర్భంగా గోపాల్పేట్లోని నల్ల పోచమ్మ జాతర మహోత్సవానికి వచ్చారు.
అనంతరం జాతర ముగించుకొని ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో వెళ్లి చూడగా బీరువాలో గల ఆరు మాసాల బంగారం,9 తులాల వెండి పట్టీలు,బోధి వెండి 5 తులాలు, ఉంగరాలు రెండు తులాలు 20వేల నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.బాధితులు చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.క్లూటీమ్తో నమూనాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.




