డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల భేటీ
01-09-2026 11:40 AM
షాద్ నగర్ సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అబ్జర్వర్, కర్ణాటక ఎమ్మెల్సీ పి.వి. మోహన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.






