calender_icon.png 5 February, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థుల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదు

05-02-2026 12:00:00 AM

జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): ప్రజలకు మనోభావాలకు తగ్గట్లుగా అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన కార్పోరేటర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారికి పార్టీ టికెట్లు కేటాయించడం జరిగిందన్నారు.

కరీంనగర్ కా ర్పొరేషన్ విజయం ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పార్టీకి గొప్ప గుర్తింపు తీసుకువచ్చే విజయమన్నారు. నాణ్యత గల నాయకులను ఈ రాష్ట్రానికి అందించిన జిల్లా కరీంనగర్ జిల్లా అని తెలిపారు. దేశానికి వెన్నె తెచ్చిన పీవీ నరసింహారావు, జువ్వాడి చొక్కా రావు లాంటి ఎంతో మంది ఈ జిల్లా నుండి వచ్చినవారేనని అన్నారు. మనం కార్పొరేషన్ గెలుస్తున్నాం అనే మనో ధైర్యంతో అభ్యర్థులంతా తమ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలకంటే ప్రచారంలో మీరు ముందు ఉండాలన్నారు. 

అభ్యర్థుల్లో పట్టుదల, కసి, గెలవాలని లక్ష్యసాధన ఉండాలన్నారు. 66 డివిజన్లకు సంబంధించి 340కు పైగా దరఖాస్తులు వచ్చినప్పటికీ 63 మందికి టికెట్లు కేటాయించడం జరిగిందన్నారు. అందులోను సమర్ధులైన వారికి తప్పకుండా పార్టీ న్యాయం చేస్తుందన్నారు. జిల్లా పరిషత్, సుడా, సింగిల్ విండో, గ్రంథాలయం, ఇతర నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు తప్పకుండా అవకాశాలు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, పిసిసి ఎస్సి సెల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఇంచార్జ్ వ్యలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.