14-02-2026 12:27:38 AM
కేసముద్రం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కేసము ద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామా లను విలీనం చేసి నూతనంగా ఏర్పాటు చేసిన కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవులకు పోటీ చేసిన పలువురు మాజీ సర్పంచులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.
ఒకటవ వార్డు నుండి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ జాటోత్ సుజాత హరి కౌన్సిలర్ గా విజయం సాధించారు. అలాగే ఐద వ వార్డు నుండి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన అమీనాపురం మాజీ సర్పంచ్ లింగాల రాజమణి కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఇక 13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ డాక్టర్ అల్లం రమ కౌన్సిలర్ గా విజయం సాధించారు.
పరాజితులైన మాజీలు!
ఇక ఐదవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అమీనాపురం మాజీ ఎంపీటీసీ అంబటి లక్ష్మి, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, 15వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీటీసీ గుగులోత్ సునీత, 16వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసముద్రం మాజీ ఎంపీటీసీ కొమ్ము స్వాతి పరాజయం పాలయ్యారు.
ఇక కేసముద్రం మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి సతీమణి కావ్య శ్రీ రెడ్డి 9 వ వార్డు నుండి పోటీ చేయగా పరాజయం పాలయ్యారు. అలాగే కేసముద్రం విలేజ్ మాజీ సర్పంచ్ రడం వెంకన్న కోడలు రడం శివ జ్యోతి పదవ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక ఇదే విధంగా కేసముద్రం విలేజ్ మాజీ వార్డు సభ్యుడు రడం శ్రీనివాస్ ఏడవ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.