10 July, 2026 | 11:52 AM

అభివృద్ధి పనులపై షబ్బీర్ అలీతో బద్దం ఇంద్రకరణ్ రెడ్డి భేటీ

10-07-2026 11:25 AM

భిక్కనూర్,జూలై 10(విజయక్రాంతి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియకు ప్రజలు పూర్తి సహకారం అందించి, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు. నియోజకవర్గానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, ప్రజా సమస్యలపై కూడా ఇరువురు చర్చించినట్లు తెలిపారు.