16 July, 2026 | 12:45 AM

రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

16-07-2026 12:28 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.

నిర్మల్, జులై 15 (విజయక్రాంతి): *లక్ష్మణచందా మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షలతో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం గ్రామంలో సిసి రోడ్లు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మందులు చేస్తుందని తెలిపారు.

సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచేందుకు ఈ గోదాంలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓస కవిత రాజు, మండల అధ్యక్షులు చిన్నయ్య, మాజీ ఎంపీపీ అడ్వాల రమేష్, మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి, నాయకులు రంజిత్, మండల అధికారులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.