కమనీయం సీతారాముల కళ్యాణం
28-03-2026 12:23 AM
అలంపూర్, మార్చి 27: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కృష్ణా నది తీరాన కొలువైన ప్రముఖ దేవస్థానం బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




