30 June, 2026 | 8:43 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం

17-01-2026 04:00 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు

ముషీరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్  బాకారంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంభ  మల్లికార్జున స్వామి(మల్లన్న) కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మాజీ ఎంపీ వి.  హనుమంతరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస రావు, నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్, రాజా దీన్ దయాల్ రెడ్డి, ఎ.  శంకర్ గౌడ్, నందగిరి నరసింహ తదితరులు కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ  అంజిరెడ్డి దంపతులు  స్వామి వారికి శాంతి బోనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ సీఐ రాంబాబు ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో అగ్నిగుండంలో ప్రవేశం, గొలుసుని  తెంపుట తదితర పూజా కార్యక్రమాల నిర్వహించారు.