calender_icon.png 18 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ వైభోగమే..

18-02-2026 12:34:02 AM

19 నుంచి ముహూర్తాలు ప్రారంభం కానున్న పెళ్లి సందడి

కరీంనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూ ర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారం భం కానుంది. నాలుగు నెలల పాటు వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు కళకళ లాడనున్నాయి. మౌడ్యమి రోజుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే శుభ ప్ర థంగా ఉండదని నానుడి. దీంతో ఆయా ది నాల్లో ఆయా కార్యాలు జరగలేదు.

19 నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 21న మరీ మంచిరోజు కావ డంతో  ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయి. మూడు నెలల తర్వాత పెళ్లిళ్లు, రిసెప్షన్లతో క ల్యాణమండపాలు మళ్లీ కళకళలాడనున్నా యి. మన పంచాగాల ప్రకారం ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26... తేదీలు వివాహాలకు అనుకూలం. అలాగే 19, 20, 21 తేదీలల్లో గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగానే ఉన్నా యి. 

21న పంచమి కావడంతో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. అలాగే వీకెండ్ కావ డం కారణాలు అని చెబుతున్నారు. ఫిబ్రవరి తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు అన్నీ మంచిరోజులే ఉన్నాయి. ఫలితంగా పురోహితులు, క్యాటరర్స్, వెడ్డింగ్ ప్లానర్ల డైరీలన్నీ ఫుల్ అయ్యాయి. వధూవరుల తల్లిదండ్రులు ఫంక్షన్ హాళ్లను వెతు క్కునే పనిలో పడ్డారు. కొన్ని ఫంక్షన్ హాళ్లు దొరికినా రేట్లు విపరీతంగా చెబుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పురోహితులు సంభావన, క్యాటరర్స్ రేట్లు కూడా పె రిగాయంటున్నారు.

మునుపు ఓ వివాహం చేయిస్తే పురోహితులు 25-60వేలు తీసుకునే వారు. ఇప్పుడు 40-80 వేలు అడుగుతున్నారని ఓ తండ్రి వాపోయారు. ఏసీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కు గతంలో 2 నుండి 6 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 4లక్షల నుండీ 8 లక్షలకు త క్కువ రాదంటున్నారని, ఇక డెకరేషన్, క్యాటరింగ్ వంటివి కూడా అదే స్ధాయిలో వెళ్లి పోతున్నాయన్నారు. ఒక్కసారిగా అందరూ శుభ ముహూర్తమంటూ ఫిబ్రవరి 21 కోసం చూడటం వల్లనే ఇంత డిమాండ్ కావొచ్చన్నారాయన.

- శుభ ముహూర్తాలు ఇవే..

ఫిబ్రవరిలో 19, 20, 21, 22, 25, 26, మార్చి నెలలో 5, 6, 7, 8, 11, 12 తేదీల్లో ఉన్నాయి. ఏప్రిల్ లో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 29, 30, మే లో 1, 3, 6, 8, 9, 10, జూన్ లో 20, 24, 25, జులై లో 1, 2, 3, 5, 8, ఆగష్టులో 16, 20, 21, 23, 26, 27, 30, సెప్టెంబర్ లో 4, 6, 7 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.

2026 సంవత్సరం పెళ్లిళ్లకు అనుకూలం..

హిందూ ధర్మంలో పదహారు సంస్కారాలలో వివాహం అత్యంత ముఖ్యమైనది. అందుకే పెళ్లి తేదీని నిర్ణయించేటప్పుడు పంచాంగ, తిథి, నక్షత్రం, శుభ సమయాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. 2026 సంవత్సరం పెళ్లిళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా దేవశయని ఏకాదశికి ముందు, దేవుత్థాన ఏకాదశి తర్వాత అనేక శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు ఆగమ,శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యులు