13 August, 2026 | 2:47 AM

ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగరేయాలి

13-08-2026 12:21 AM

నాగోల్, ఆగస్టు12 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, అశ్విన్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట రెడ్డి, కొత్త తిరుమల, వీరా రెడ్డి, ర్యాక శ్రీనివాస్, శంకర్రావు, ఉదయ్ జోషి, శ్రవణ్, అజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.