గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్
మరిపెడ (మహబూబాబాద్) మార్చి 1 (విజయక్రాంతి): గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ అని, ఆయన చూపిన మార్గంలో నడవాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామ చందృ నాయక్ అన్నారు. సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా మరిపెడ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో సంత్ సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని చెప్పారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో కాంగ్రెస్ సర్కారు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.
మండల పరిషత్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ వీరా సింగ్ , నూకల అభినవరెడ్డి , రామ్ లాల్, మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్ వీసారపు ప్రగతి, వైస్ చైర్మన్ కాలం సునీత, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, రవి నాయక్, విజయ్ నాయక్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, బంజారా నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




