22 March, 2026 | 2:25 AM

శ్రమ మాది శిలా ఫలకాలు మీవి! X అబద్ధాలు, అహంకారం పోలేదు

22-03-2026 12:55 AM

శ్రమ మాది శిలా ఫలకాలు మీవి!

  1. సిద్దిపేటకు సీఎం ఏ ముఖం పెట్టుకొని వస్తారు?
  2. ప్రజా పాలన కాదు.. రైతులను మోసం చేస్తున్న పాలన
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, మార్చి 21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు ఏం ముఖం పెట్టుకొని వస్తారని, సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను రద్దు చేశానని చెప్పడానికా అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి మంజూరు చేసిన పనులకు ఇప్పుడు మీరు వస్తున్నారు.

కష్టం మాది రిబ్బన్ కటింగ్ మాత్రం మీది. శ్రమ మాది, శిలాఫలకాలు మీవి’ అని విమర్శించారు. తమ ప్రభుత్వం మంజూరు చేసి అమలు చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు సీఎం వచ్చి ప్రారంభోత్సవాలు చేయడం అనేది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, ఆయుష్ హాస్పిటల్, జిల్లా జైలు వంటి కీలక ప్రాజెక్టులన్నీ తమ ప్రభుత్వం మంజూరు చేసినవేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.

తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయుష్ హాస్పిటల్‌ను ఆమోదం ఇచ్చాం. ఇప్పుడు మీరు వచ్చి ప్రారంభిస్తున్నారు. తాము నిర్మించిన వాటికి మీరు శిలాఫలకాలు వేయడం తప్పా కొత్తగా ఏమీ చేయలేదు అని విమర్శించారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తీసుకెళ్లాలని సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన కాదు రైతులను మోసం చేస్తున్న పాలన అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల మనసుల్లో అసలు అభివృద్ధి ఎవరు చేశారో వారికి స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు కాళేశ్వరం నీటిపారుదల ఎంతో కీలకమైందని చెప్పారు. గతంలో ఈ ప్రాజెక్టును విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ వల్ల వచ్చిన ప్రయోజనాలను వినియోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం లో ఇచ్చి న రుణమాఫీ హామీ ని ఇప్పటికీ అమలు చేయలేదని, మూడు పంటలకు రైతు బంధు అం దించలేదని ఆరోపించారు. అకా ల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

వెంటనే నష్టపరిహారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ని యోజకవర్గంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత సుమారు రూ.1,070 కోట్ల విలువైన పనులు రద్దు చేశారని ఆరోపించారు. ఆ పనులను తిరిగి ప్రారంభిం చేందుకు నిధులు కేటాయించాలని కోరా రు. రుణమాఫీ చేయకపోతే సిద్దిపేటకు రా ను అని పాత బస్టాండ్ వద్ద చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఏ ముఖంతో వస్తున్నారు? అని ప్రశ్నించారు. 

అబద్ధాలు, అహంకారం పోలేదు

  1. అంతా పెద్దమనిషివి బుద్ధుండి మాట్లాడాలి
  2. చెక్‌డ్యామ్‌లకు బాంబులు పెట్టారా?
  3. అభివృద్ధి పనులు ఎవరి సొంతం కాదు
  4. హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల విమర్శలు 

సిద్దిపేట, మార్చి 21 (విజయక్రాంతి)/నంగునూరు: అబద్ధాలు, అహంకారం, అవినీతి, మభ్యపెట్టడం ఇంకా పోలేదని, అంత పెద్ద మనిషివి ఇంత చిల్లరగా మాట్లాడటానికి బు ద్ధుండాలి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ మంత్రి హరీశ్‌రావును పరోక్షంగా విమర్శించారు. సిద్దిపే ట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రా మంలో నిర్మించిన పామాయిల్ పరిశ్రమను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం పరిశ్రమ వద్ద  మీడియా సమావేశంలో తుమ్మల  మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు నాయకుల సొంత డబ్బులతో ఎవరు ఖర్చు చేయరని చెప్పారు. నేను చేశాను, మా పార్టీ చేసిన పని, మేము కష్టప డ్డాం ఇలాంటి మాటలు చెపుతూ ప్రజలను మభ్య పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం మారినప్పుడు పనులు కూడా మారుతాయ ని కనీస అవగాహన కలిగి ఉండాలని విమర్శించారు.

తాను మంత్రి పదవి చేపట్టాక మొట్టమొదటి సంతకం ఐదు పరిశ్రమల కోసం చేశానని, అందులో మొదటి సంతకం నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ అని గుర్తు చేశారు. 2024లో ఈ పరిశ్రమకు అనుమతులు వచ్చాయని, రూ. 300 కోట్లు మం జూరు చేసి, 16 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. 31 జిల్లాల్లో పంట సా గుకు అనుకూలం ఉందని అందుకే పరిశ్రమ నిర్మాణానికి సిద్దిపేటని ఎంచుకున్నామని చెప్పారు.

రంగనాయక, మల్లన్న సాగర్లులు ఉన్నాయని మాత్రమే ఇక్కడ ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేశామనడం అవగాహన లోపమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేశామని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడాన్ని తిప్పి కొట్టారు. రైతులకు రుణం మాఫీ చేయడంతో పాటు అధికంగా వడ్డీ పెరిగిందని, రైతుబంధు పేరిట రైతులు, దళిత బంధు పేరిట దళితులు మోసపోయారని, అందుకే మీకు ఆ గతి పట్టిందంటూ  విమర్శించారు.   

నర్మెట ఆయిల్ పామ్ నిర్మాణానికి వెచ్చించిన డ బ్బు మీ సొత్తు కాదని, మా బాపు సొత్తు అ సలే కాదంటూ విమర్శలు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించింది కాం గ్రెస్ పార్టీ కాలేశ్వరం నుంచి కాకుండా ఎల్లంపల్లి నుంచి సాగునీరు చేస్తున్నామని, మీరు ప్రా జెక్టులు నిర్మించకన్న ముందే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీటిని తరలించామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక మూడు సంవత్సరాలకే కూలిపోతే ఆ ప్రాజెక్టును ఏమంటారు అని ప్రశ్నించారు.

చెక్ డాంల కింద బాంబులు పెట్టి కూల్చామంటూ ప్రచారం చేయడానికి బుద్ధి ఉండాలని, నిర్మాణ లోపాల వల్ల కూలిపోతాయన్న క నీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు. పరిశ్రమ ప్రారం భోత్సవానికి అం దరూ ఆహ్వానితులేనని , ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పాల్గొనాలని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేతలను కోరారు.  మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, అధికారులున్నారు.