12 May, 2026 | 8:50 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలి

25-03-2026 12:00 AM
  1. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
  2. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో భేటీ

న్యూఢిల్లీ, మార్చి 24: భారత్ త్రివిధ దళా లు ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసిద్ధంగా ఉం డాలని, శత్రువులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో సంఘర్షణ, ఇటీవల పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం భద్రతాదళ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వ హించారు.

ఈ సమావేశంలో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకరోజు ముందే ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రసంగంపై కూడా అధికారులకు పలు సంకేతాలను వివరించారు. పశ్చి మాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశా రు.

పరిస్థితులు ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే భారత్ సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ సంఘర్షణ మరింత పెరిగేందుకు ఆస్కారం లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలో తీర రక్షణ దళాలు, సరిహద్దు దళాల్లో సమన్వయం, సన్నద్ధత అత్యంత అవసరమన్నారు. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, ఆయతుల్లా ఖమేనీ మృతి, పూటకోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మారుస్తుండడంతో ఇంకా ఉపద్రవం పొంచి ఉండే ఆస్కా రం లేకపోలేదనే అభిప్రాయాన్ని రాజ్ నాథ్ సింగ్ వ్యక్తం చేశారు. 

దేశంలో పలువురు ఉగ్రవాద సానుభూతి పరుల అరెస్టులు, సరిహద్దు ప్రాంతాల్లోని అప్రమత్తతపై ఆరా తీశారు. నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. మోదీ నేతృత్వంలోని భద్రతా దళాలు అన్నివేళలా, ఎలాంటి పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొ నేందుకు సంసిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.