31 July, 2026 | 12:50 AM

పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

31-07-2026 12:00 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, జూలై 30: పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. స్నేహ హస్తాలు ఫౌండేషన్, రే ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోదాడ మండలంలోని రెడ్లకుంట ప్రాధమికోన్నత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు.

స్నేహ హస్తాలు ఫౌండేషన్, శ్రీలక్ష్మి ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు కునుగుంట్ల రవి కుమార్, రేఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ బాధ్యులు కంఠమనేని హేమ సహకారంతో సుమారు రూ.6.50 లక్షలతో ప్రాధమికోన్నత పాఠశాలలో అధనపు వాష్ రూమ్స్ నిర్మాణం, పెయింటింగ్ పనులు చేయడం పట్ల దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి ఒక్కరూ పాఠశాలల బలోపేతానికి తమవంతు చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు, మండల పార్టీ అద్యక్షుడు శరభేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, నవీన్, ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, నంబూరి సూర్యం నాయకులు తదితరులు పాల్గొన్నారు.