ముపాపా వచ్చేది అప్పుడే
02-07-2026 12:13 AM
బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా యశ్‌రాజ్ ఫిల్మ్స్, పోషమ్ పా పిక్చ ర్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘ముపాపా’. యశ్‌రాజ్ ఫిలమ్స్ సీఈవో అక్షయ్ విదాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండియన్ మూవీస్‌లో ప్రముఖ షో రన్నర్, డైరెక్టర్ సమీర్ సక్సేనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న విడుదల కానున్నట్లు మేకర్స్ బుధవారం అధికారికంగా తెలియజేశారు.






