calender_icon.png 8 February, 2026 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పాలనలో రాష్ట్రం స్వర్ణ యుగం

08-02-2026 12:23:38 AM

మున్సిపోల్స్‌లో అభివృద్ధికి ఓటు వేయండి 

కామారెడ్డిలో మంత్రి అజారుద్దీన్ 

కామారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మున్సిపాలిటీల అభివృద్ధి కోరుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కోరారు. శనివారం కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫు న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ స్వర్ణ యుగంగా మారుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరోగ్యారంటీలను యుద్ధ ప్రతిపాదికన అమలు చేస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ. 500 ల సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి అన్నారు. 

రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 6000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారన్నారు. ఉద్యోగ నియమకాలు గత రెండేళ్లలో 51 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం మైనార్టీల విద్య ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నేరేళ్ల శారద, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.