calender_icon.png 8 February, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తా

08-02-2026 12:26:01 AM

ఆశీర్వదిస్తే ఎక్కడ లేని అభివృద్ధి చేసి చూపిస్తా.. 

స్వతంత్ర అభ్యర్థి లక్ష్మమ్మ లింగం

మహబూబ్‌నగర్ లోని 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మమ్మ లింగం

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని 30వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి లక్ష్మమ్మ లింగం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 30వ డివిజన్‌లో గల హనుమాన్ పుర బండమీదిపల్లి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఇంటి మనిషిలా ఆదరిస్తున్నారని, సిలిండర్ గుర్తుకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయాలని కోరారు.

ఇంత ఆదరణ చూపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు.గతంలో సర్పంచ్ గా ఉన్న సమయం నుంచి అందరి ఆశీర్వాదంతో బండమీదిపల్లిని ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవడం జరిగిందన్నారు. జనం సైతం లింగమయ్య చెప్పిండంటే ఏమైన చేస్తారని, ఇందులో ఎలాంటి సందేహం ఉండదు అన్నారు. నిరుపేదలకు ఆపద వస్తే అండగ నిలబడి వారి సమస్యకు పరిష్కార రూపం దాల్చడం జరిగిందని ఓటర్లు చెబుతున్నారు. మెజార్టీ వర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థి లింగమయ్య కె మద్దతు తెలియజేస్తామని ఆ ప్రాంతవాసులు చెబుతున్న మాట. ఈ కార్యక్రమంలో డివిజన్ ఓటర్లు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.