17 March, 2026 | 10:55 AM

తల్లి కళ్లెదుటే కొడుకు దుర్మరణం..

17-03-2026 01:21 AM

అలంపూర్, మార్చి 16:తల్లితో కలిసి బైక్ పై వెళ్తున్న కుమారుడు అట్టి బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొన్న ఘటనలో కొడుకు దుర్మరణం చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో సోమవారం జరిగింది.

ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన యాకూబ్ భాషా, సత్తాజ్ బేగం దంపతుల కుమారుడు మజార్ (19) పని నిమిత్తం తన తల్లితో స్వగ్రామం నుంచి కర్నూల్ కు బైక్ పై బయలుదేరాడు.

ఈ క్రమంలో అలంపూర్ చౌరస్తా ఉత్తర ఫుడ్ కంపెనీ వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మజార్ కు తలకు బలమైన గాయం తగిలి రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి సత్తాజ్ బేగం తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన స్థలానికి అంబులెన్స్ సిబ్బంది చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. కళ్ళు ఎదుటే కొడుకు చనిపోవడంతో తల్లి కన్నీరుమున్నిరయింది.అయితే రంజాన్ పండుగ ముందు ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మృతుడు హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు