బస్సు యాత్రను అడ్డుకుంటాం..
* ఆదివాసీ సంఘాల నాయకుల నిర్ణయం..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఈనెల 25 నుండి ఆదివాసి గిరిజనుల ఎస్టీ రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తయి ఉందని నిర్వహించబోయే బస్సు యాత్ర అని అడ్డుకుంటామని ఆదివాస సంఘాల నాయకులు అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్కా బాపురావు, గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ రాష్ట్ర మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సేద్మకి రామారావు తదితరులు మాట్లాడుతూ... ఆదివాసులకు ఎస్టీ రిజర్వేషన్ ఎవరు ఇచ్చింది కాదన్నారు.
ఆదివాసి గిరిజన వీరుల పోరాటం వల్ల ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం వచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసి గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివాసి గిరిజన ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సు యాత్ర నిర్వహించాలని ఈ నెల 25న టిపిసిసి ఆదివాసి కాంగ్రెస్ నిర్ణయించడాన్ని ఆదివాసులు వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు. భారత దేశ మూలవాసులు ఆదివాసుల అనగా ఆది నుంచి భారతదేశంలో ఉంటున్న భారతీయులు వీరిని మొదటగా పూర్వ ఆదివాసులని పిలిచేవారు ఈ వారసత్వమే ఫలితంగా ప్రస్తుత ఆదివాసి తెగలు ఉన్నాయి
రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూల్ పేరా ప్రకారం షెడ్యూల్(1)పేరా ప్రకారం షెడ్యుల్ ప్రాంత విద్య ఉపాధి రాజకీయ ఉద్యోగాలన్నీ 1950 ముందు నుంచి స్థిర నివాసం కలిగి ఉన్న ఆదివాసి తెగలకు మాత్రమే వివిధ శాఖలలో ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. మైదాన ప్రాంతంలో ఎస్టీలుగా కొనసాగుతున్న లంబాడీలు షెడ్యూల్ ఏరియాలో వచ్చి స్థానిక తహసీల్దారుల దగ్గర నుంచి అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దోచుకుంటున్నారని విమర్శించారు.
రాజకీయ నాయకుల బలంతో బస్సు యాత్రల పేరుతో అసలైన ఆదివాసుల మేమే అని చెప్పుకునే స్థాయికి వచ్చేందుకే బస్సు యాత్ర అని అన్నారు. వారు చేపట్టే బస్సు యాత్రను ఆదివాసులందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 79 ఏళ్ల స్వతంత్ర్య పాలనలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఆదివాసుల అభివృద్ధికి పాటుపడకుండా ఆదివాసులను అణగద్రోక్కే విధానాలకు పాల్పడుతున్నారని,ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాణం పోస్తూ కులాలను తెగలలో విలీనం చేసి ఆదివాసి జీవితాలకు ప్రశ్నార్థకంగా చేస్తున్నారని ఆరోపించారు.
దీనికి కారణం 1976లో అక్రమంగా ఎస్టీ జాబితాలో లంబాడీలు చేర్చి, ఆదివాసులకు అందవలసిన రిజర్వేషన్ దోచుకుంటున్నారని ఆరోపించారు.పాలకులు మాత్రం ఏం పట్టినట్టుగా ఉంటున్నారని ఆరోపించారు.ఆదివాసీల రిజర్వేషన్లు దగాబడుతున్న నేడు పోరాట మార్గమే శరణ్యంగా ఆదిలాబాద్ నుండి మరో చరిత్రక పోరాటాన్ని సిద్ధమవుతున్నామని వారు తెలిపారు. లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తేనే ఆదివాసులకు మనుగడా సాధ్యమన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. వారితోపాటు తుడుం దెబ్బ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






