16 May, 2026 | 3:26 PM

తండ్రిని చంపిన కొడుకు

16-05-2026 01:21 AM

భూమి కౌలు గొడవలో రోకలిబండతో కొట్టి..

కరీంనగర్ జిల్లా చిన్నకోమటిపల్లిలో ఘటన

జమ్మికుంట, మే 15 (విజయక్రాంతి): భూమి కౌలు గొడవలో రోకలిబండతో కొట్టి తండ్రిని చం పేశాడు ఓ కొడుకు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని చిన్నకోమటిపల్లిలో జరిగింది. చిన్నకోమటిప ల్లికి చెందిన చిట్ల సంపత్ (60)కు చిట్ల శ్రీధర్ (38), చిట్ల శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు. శుక్రభారం ఉ దయం వ్యవసాయ భూమి కౌ లు విషయంలో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పెట్టుకున్నారు.

ఈ క్రమంలో శ్రీనివాస్ తన తమ్ముడైన శ్రీధర్‌ను రోకలిబండతో కొట్టడానికి ప్రయత్నించాడు. శ్రీధర్ పక్కకు తప్పు కోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి తండ్రి చిట్ల సంపత్ జోక్యం చేసుకుని శ్రీనివాస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్.. తండ్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ  చేతిలో ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో సంపత్ అక్కడికక్కడే పడి పోయాడు. నిందితుండిపై ఇల్లందకుంట పోలీసులు కేసు నమో దు చేసి విచారణ చేపట్టారు.