ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
16-05-2026 02:57 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) శనివారం ఉదయం స్వల్ప పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జాతీయ రాజధానిలో ఈ సాయంత్రం జరిగే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of the Telangana High Court) అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ విందులో ఆయన పాల్గొననున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి శనివారం రాత్రికి గానీ, ఆదివారం ఉదయానికి గానీ హైదరాబాద్‌కు తిరిగి వస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.






