ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావి లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని మంగాపురం గ్రామంలో జరిగింది.స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మంగాపురం గ్రామానికి చెందిన గుండు అంజయ్య ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు గుండు సాయి (14) నేరేడుచర్ల లోని గురుకుల పాఠశాలలో 7 వ తరగతి పూర్తి చేసి వేసవి సెలవులు అయినందున ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మృతుడు సాయి తన స్నేహితులతో కలిసి ముంజకాయలకు వెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న బాణోతు రామచంద్ర బావిలో ఈతకు దిగారు.మృతుడు సాయి కి ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు మృతుని తండ్రి గుండు అంజయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ తెలిపారు






