16 May, 2026 | 2:22 PM

బోరుబావిలో పడిన మనవడు.. రక్షించే ప్రయత్నంలో తాత మృతి

16-05-2026 01:45 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda) మిర్యాలగూడలోని ఊట్లపల్లి గ్రామం విషాదం చోటుచేసుకుంది. ఒక వ్యవసాయ పొలంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన తన మనవడిని రక్షించే ప్రయత్నంలో 50 ఏళ్ల వెంకన్న అనే వ్యక్తి మరణించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెంకన్నను, అతని మనవడిని బోరుబావిలోంచి బయటకు తీశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకన్న మరణించగా, ఆ బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.