ప్రజాస్వామ్యానికి భారత్ మాతృదేశం
కాలం మారినా.. భారతీయ సంస్కృతి మారలేదు
భారత్ లో 90 కోట్ల మంది ఓటర్లు
డిజిటల్ ట్రాన్సాక్షన్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ(Narendra Modi) పర్యటిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో సాంస్కృతిక నృత్యాలతో మోదీకి ఘనస్వాగతం లభించింది. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాసాంధ్రులను ఎంతో ప్రశంసించేవారని తెలిపారు. నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని మోదీ పేర్కొన్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని తెలిపారు. కాలం మారినా.. భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు.
భారత్ సెమీకండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. మేడిన్ ఇండియా చిప్ లు తయారవుతున్నాయని సూచించారు. ఏఐ సమ్మిట్, జీ 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. భారత్ లో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 65 కోట్ల మంది ఓటు వేశారని చెప్పారు. ఈయూ దేశాల జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది లేరన్న ప్రధాని మోదీ ప్రాజాస్వామ్యానికి భారత్ మాతృదేశమని ప్రధాని పేర్కొన్నారు.






