22 May, 2026 | 1:41 AM

రైతుల నిలువు దోపిడీ

22-05-2026 12:59 AM

వేధిస్తున్న కూలీలు లారీల కొరత

సొంత డబ్బులతోనే సంచుల కొనుగోలు

గోదాములు చెయ్యి తడిపితేనే అన్లోడింగ్ 

జిల్లాలో దిక్కుతో రైతులు 

చోద్యం చూస్తున్న అధికారులు 

నిర్మల్ మే 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పంట కొనుగోలను అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం చెయ్యి తాడిపనిది పంట అమ్ముడుపోవడం లేదని చాలామంది రైతులు ఆరోపిస్తున్నారు. పగలనకా రాత్రనకా కష్టపడి పంటలు పండిస్తే పండిన పంటలు విక్రయించుకోవడానికి చెయ్యి తడుపల్సి రావడం ఏంటని రైతులు స్కూటీ గా గానీ ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు పం డించిన మొక్కజొన్న వరి పంట రికార్డ్ స్థా యిలో పండడంతో పంట కొనుగోళ్ల ప్రక్రి య తరలింపు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 24 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సుమారు 80 లక్షల మొక్కజొన్న కొనుగోలు పూర్తికాగా మరో 60 లక్షల వర కు ఉంటుందని అంచనావేస్తున్నారు. జిల్లా లో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం 2400 మద్దతు ధర ప్రకటించగా ప్రైవేట్ లో 1750 కొనుగోలు చేయడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకునేందుకు మగ్గుచూపుతున్నారు. ఈసారి రైతులు వేసుకున్న పంటల్లో మొక్కజొన్న పంటలు దిగుబడి కూడా బాగానే వచ్చినట్టు రైతులు తెలిపారు. ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్టు చెప్తున్నారు.

దీంతో కుంటాల భైంసా లోకేశ్వరం నర్సాపూర్ కుబీర్ దిల్వార్పూర్ సారంగాపూర్ ప్రాంతా ల్లో వేలకుంటల మొక్క నిల్వలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిలిచి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ నెంబర్ వేస్తున్నారు. ఈ సీరియల్ నెంబర్ రావడానికి కనీసం 20 రోజులు సమయం పడుతుంది. చిన్న సన్న కారు రైతులు పంట తక్కువగా సాగు చేయగా కొన్ని గ్రామాల్లో కుక్క రైతు ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు మొక్కజొన్నలు బాగు చేశారు.

దీంతో ఒక రైతు పంట కనీసం 1 50 క్వింటాలనుంచి 1000 క్వింటాళ్ల వరకు దిగుబడి రా వడంతో వాటిని అమ్ముకునేందుకు పెద్దపెద్ద కుప్పలు పోస్తున్నారు. పెద్ద కుప్ప తూకం వేసి సంచులు నింపి గోదాములకు తరలించేందుకు కూలీలకు రెండు రోజుల సమ యం పడుతుంది. రెండు లారీలు అవసరం అవుతున్నాయి. ఇక చిన్న సన్న కారు రైతులు తక్కువగా ఉన్నవారు వంతు వచ్చేవరకు ఇబ్బందికి గురవుతున్నారు. 

కూలీలు లారీలు సంచుల కోరుతా 

నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న నిలువలు పెరిగిన కొనుగోలు కేంద్రాల్లో కూ లీల కొరత, లారీల కొరత, గో నసంచుల కొ రత తీవ్రంగా ఉంది. గోదాములు కూడా దగ్గరగా లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా ఈ సీజన్లో మొక్కజొన్న వరి ఒకేసారి మార్కెట్కు రావడం, సాధారణంగా బీహార్ కలకత్తా కూలీలు ఈ పనులు ఎక్కువగా పాల్గొని వారు.

ఈసారి కలకత్తాలో ఎన్నికల కారణంగా కూలీలు పెద్ద సంఖ్యలో రాలేదు. వచ్చిన కూలీలు కూడా ఎక్కువగా నిజాంబాద్ కరీంనగర్ ప్రాంతంలోనే ఉన్నారు. నిర్మల్ లో కూలీల  కొరత తీవ్రంగా ఉంది. సంచులు కూడా స్టాకు లేకపోవడంతో ప్రైవే ట్ లో 25 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో 20 రూపాయల దొరికిన సంచి ఇప్పుడు ఐదు రూపాయలు పెంచి రైతుల వద్ద నుంచి దోపిడీ చేస్తున్నారు.

ఇక లారీల విషయానికొస్తే అసలు రవాణా చేసినందుకు లారీలు లేకపోవడం మహారాష్ట్ర లోని ధర్మాబాద్ బోకర్ కీ న్ వాట్ ప్రాంతాల లారీ యజమానులతో రై తులే సంప్రదింపులు జరుపుతున్నారు. లారీలను మొక్క కొనుగోలు చేసిన మార్కెట్ ఏజె న్సీ ఎరువకులు ట్రాన్స్పోర్ట్ టెండర్ దారులకు రవాణా చేసే అవకాశం ఇవ్వాలి. లారీ లు కొరత ఉండటంతో రైతుల స్వయంగా ప్రైవేట్ హాస్పిటలను సంప్రదించి సంచికి 40 రూపాయలు చెల్లిస్తున్నారు. గతంలో సంచికి 25 రూపాయలు ఉన్న ధర 15 రూ పాయలు పెంచారు.

అంటే క్వింటాల్కు 80 రూపాయలు రైతు భారాన్ని మోపుతున్నారు తూకం వేసి సంచులు కుట్టి లారీల్లో లోడ్ చేసే బీహార్ కలకత్తా మహారాష్ట్ర కూలీలు తరలి పెంచినట్టు రైతులు తెలిపారు. గతం లో అన్నింటికీ కలిపి 30 రూపాయలు తీసుకునే వీరు 20 రూపాయల పెంచి 50 రూ పాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. అంత డబ్బు ఇవ్వకుంటే తమ పంట అమ్ముకునే పరిస్థితి లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పం ట కళ్ళలో వేసి ఇప్పటికే నెల రోజులు అయ్యింది.

ప్రతిరోజు పంటకు కాపల కాయ డం, వర్షం వస్తే వాటిని తడవకుండా రక్షణ కవర్లు అప్పడం, పశువులు దొంగల నుంచి కాపాడుకునేందుకు రైతులు పంటకు పలికే పరిమితమవుతున్నారు, మరో 10 రోజులు కడిస్తే వాన కాలం సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సీజన్లో రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాలు ఎరువులు సేకరించుకుని వర్షం కురిస్తే పంటలు వేసుకునేందుకు సిద్ధమయ్యే కాలంలో ఉన్న పంటను అమ్ముకోలేక చేతిలో పెట్టుబడికి డబ్బులు లేక అన్నదాత గోసపడుతున్నారు. ప్రతిరోజు కొందరు రైతులు గ్రూపులుగా ఏర్పడి జాతీయ రహదారులపై వచ్చి రోడ్డుపై వెళ్తున్న లారీలను ఆపి ధాన్యం తరలింపు బస్తాల కిరాయి మాట్లాడుకుని పంటను వారి స్వయంగా తరలించుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

దీనికి తోడు పంటను గోదాములకు తరలిస్తే అక్కడ గోదాం గోదాం ఇంచార్జిలు చెయ్యి తడుపుతిని అన్లోడింగ్ చేస్తున్నారు. లేకుంటే ఇది నాశరకంగా ఉందని నాణ్యతగా లేదని క్వింటాలకు 5 కేజీల నుంచి 7 కేజీల వరకు కట్ చేస్తామని రైతులకు చెప్తున్నారు. లారీ డ్రైవర్ ద్వారా పోదాం ఇన్చార్జిలతో మాట్లాడి మామూలు ఇస్తే లారీ కాళీ అవుతుందని రైతులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగాల్సినవలసి ఉన్న రైతులే స్వయంగా తమ పంట అమ్ముకోవడానికి పడుతున్న కష్టాలకు నిదర్శనంగా రైతులు చెప్తున్నారు. 

అధికారుల పర్యవేక్షణ వేగవంతం 

నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు రావడం లారీలు గోన సంచులు కూలీల కొరత గోదాముల వద్ద రైతులు పడుతున్న తిప్పలను గుర్తించిన జిల్లా అధికారులు అక్రమాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ఎవరికి లంచాలు ఇవ్వవద్దని ప్రభుత్వం పంట కొనుగోలను కొనుగోలు చేసే బాధ్యతను తీసుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు నిర్వాకులు అక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజు ఆయా పునుగులు కేంద్రాల్లో దినసరి పోగ్రస్ రిపోర్టును తెప్పించుకుంటున్నారు రెవిన్యూ పోలీస్ శాఖ రవాణా శాఖ సంయుక్తంగా రోడ్లపై కాలి వాహనాలను గుర్తించి ట్రాన్స్పోర్ట్ కు సహకరించాలని కోరుతున్నారు. గోదాములు నిలువపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. గుణ సంచుల కురుతపై ప్రభుత్వానికి సమాచారం అందిస్తూ సంచులను సర్పంచి విధముగా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న రైతులు మాత్రం వానాకాలం దృష్టిలో పెట్టుకుని పంటను వీలైనంత త్వరగా అమ్ముకోవాలని ఆశతో ఎదురుచూస్తున్నారు