1 July, 2026 | 8:10 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం

21-04-2026 12:38 AM

ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ ఏప్రిల్ 20: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కోదాడ ఫైర్ స్టేషన్కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్ వాహనాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిబ్బంది, బాలాజీ నగర్ ప్రజల కోసం కార్యాలయ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది నిరంతరం ప్రజల భద్రత కోసం కృషి చేస్తూ అత్యవసర సమయాల్లో సేవలు అందించడం గర్వకారణమని అన్నారు. వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.

వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వివిధ అధికారులతో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. చిలుకూరులో ఎన్డీసీసీబీ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా అగ్నిమాపక అధికారి వై కృష్ణారెడ్డి, స్టేషన్ అగ్నిమాపక అధికారి డాక్టర్ బాబు, స్థానిక కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, చైతన్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.