1 July, 2026 | 9:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మేట్లకు ట్రైనింగ్ నిర్వహించి ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలి

21-04-2026 12:36 AM

వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్

దేవరకొండ, ఏప్రిల్ 20: మేట్లకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలి. అని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు. సోమవారం పీఏ పల్లి మండల కేంద్రంలో ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ పేమెంట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకొని కొత్త చట్టం ద్వారా కూలీలను పనికి దూరం చేయటానికి రెండు సార్లు ఫోటోలు అప్లోడ్ విధానం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పటిష్టంగా అమలు జరగాలంటే మెట్ల వస్తున్న తీసుకొని ప్రతి సంవత్సరం ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి మేట్లకు పారితోషకం ఇవ్వాలని ఫీల్ అసిస్టెంట్ పర్మినెంట్ చేయాలని పేదల సాగు భూముల అభివృద్ధికి పనులు చేపట్టి కేంద్ర బడ్జెట్లో కనీసం రూ 2’64 లక్షల కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి కావలి కృష్ణయ్య, పావురాల గట్టు వార్డ్ మెంబర్ మోతిలాల్, ఎం వెంకటేశ్వర్లు, సాయిలు, ఆర్ చందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.