27 February, 2026 | 4:59 AM

రెండో గీతం వస్తోంది!

27-02-2026 01:10 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో తరుచూ ప్రమోషనల్ కంటెంట్ ఇస్తూ అంచనాలను పెంచుతోందీ చిత్రబృందం. తాజాగా ‘రై రై రా రా’ అనే రెండో గీతాన్ని మార్చి 2న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పంచుకున్న సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌చరణ్ మ్యాసివ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.