‘సర్’ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి
ఇబ్రహీంపట్నం, జులై ౧౦ (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రెవిజన్) డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్ర మాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (ఈరోస్), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏరోస్), జోనల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలె క్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిపై జోనల్ కమిషనర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ, క్షేత్రస్థాయి లో బీఎల్‌ఓలు సేకరించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో డిజిటలైజ్ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబం ధనలు, మార్గదర్శకాల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేపట్టి, సేకరించిన వివరాలను వెంటనే డిజిటలైజే షన్ చేయాలని ఆదేశించా రు. డిజిటలైజేషన్ ప్రక్రియ జిల్లాలో సోమవారం నాటికి కనీసం 60 శాతం పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి, ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
డేటా నమోదు సమయంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి సాంకేతిక లేదా సమాచార లోపాలు లేకుండా అత్యంత జాగ్రత్తతో ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సూచిం చారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.






