6 March, 2026 | 8:04 AM

జిల్లా పంచాయతీ అధికారి కావలెను?

06-03-2026 01:53 AM

బోసిపోతున్న సంగారెడ్డి డీపీవో కార్యాలయం 

నెలల తరబడిగా జడ్పీ సీఈవో ఇంచార్జి పాలన

అదనపు భారంగా మారిందంటున్న సీఈవో

జిల్లా కార్యాలయంలో కనిపించని అధికారులు

అస్తవ్యస్థంగా మారిన పంచాయతీలు

మూలనపడ్డ పదోన్నతుల ప్రక్రియ

కలెక్టర్ చొరవ చూపితేనే పరిష్కారం

సంగారెడ్డి, మార్చి 5(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాకు పంచాయతీ అధికారి కావలెను..? అవును జిల్లాలో రెగ్యులర్ డీపీవో లేక నెలలు గుస్తున్నా ఉన్నతాధికారుల్లో చలనం కలగడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇం చార్జి పాలనలో సిబ్బంది సైతం విధులకు ఎగనామం పెడుతున్నారు.

జిల్లాలో అతి ముఖ్యమైన శాఖగా ఉన్న పంచాయతీ కా ర్యాలయం బోసిపోతోంది. గ్రామ పంచాయ తీ ఎన్నికలకు ముందు ఇక్కడ డీపీవోగా పనిచేసిన సాయిబాబా పలు అవినీతి ఆరో పణలపై బదిలీ అయ్యారు. అప్పటి నుండి జడ్పీ సీఈవోను ఇంచార్జిగా బాధ్యతలను అప్పగించారు. కలెక్టరేట్లో పేరుకే పంచాయతీ కార్యాలయం ఉంది. శాఖా వ్యవహా రాలన్నీ జడ్పీ కార్యాలయంలో జరుగుతున్నాయి. పంచాయతీ శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు జడ్పీ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు సైతం జడ్పీ కార్యాల యానికే వెళ్ళాల్సి వస్తోంది. అతి ముఖ్యమైన శాఖలో జిల్లా అధికారి బదిలీ అయితే ఇప్పటి వరకు నియామకం చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

గాడితప్పుతున్న పంచాయతీలు...

గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పను లు, నిరంతర పనులు మూలనపడ్డాయి. కార్యదర్శులు సమస్యలను విన్నవించుకోవడానికి జిల్లా కార్యాలయానికి వెళ్తే అధికా రులు కూడా కనిపించకుండా పోయారని పలువురు కార్యదర్శులు వాపోయారు. డీపీవో బదిలీ కావడంతో ఏవో సైతం సెలవుపై వెళ్ళడంతో కార్యాలయం ఖాళీగా కనిపిస్తోందని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇంచార్జిగా ఉన్న సీఈవో తమ గోడు వినే దుస్థితి లేదని చెప్పారు. దీంతో పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీలలో విధు ల నిర్వహణ కొరవడింది. తనిఖీలు లేకపోవడంతో ఇష్టారీతిగా మారింది. పంచాయ తీలలో పన్నుల వసూలు, పారిశుద్ధ్యం పను లు పట్టించుకునే వారు కరువయ్యారు. అంతేగాకుండా వేతనాలు సైతం సరిగా రావడం లేదని పలువురు వాపోయారు. ఎంపీవోలు, డీఎల్పీవోలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారిగా ప్రస్తుతానికి ఇదే శాఖకు చెందిన డీఎల్పీవోలకు బాధ్యతలు అప్పగిస్తే కనీసం తమ గోడు వినేవారని, ఇప్పటికైనా రెగ్యులర్ డీపీవోను వెంటనే నియమించాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. 

మూలనపడ్డ పదోన్నతులు...

జిల్లాలో పనిచేస్తున్న సర్వీసు కలిగిన కార్యదర్శులకు రావాల్సిన పదోన్నతి కూడా ఆగిపోయింది. నోషనల్ ప్రమోషన్లు పొందాల్సిన ఉద్యోగులు రెగ్యులర్ డీపీవో లేకపో వడంతో వారి జాబితా లిస్టు తయారు చేయలేదు. దీంతో వారి ప్రమోషన్లు ఆగిపోయా యి. ఈ విషయంలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పర్యటన చేసినప్పుడు విన్నవించుకోగా అధికారు ల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. 

ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని త్వరగా జాబితా సిద్ధం చేసి పంపించాలని కోరినా పట్టించుకున్న అధికారులు లేరు. గ్రేడ్ 3 ఉద్యోగులకు గ్రేడ్-2, గ్రేడ్ -1 పదోన్నతులు రావాల్సిన వారు ఎదురుచూపులతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. అంతే గాకుండా జిల్లాలో సుమారు 450 మంది జూనియర్ కార్యదర్శులు రెగ్యులరైజేషన్ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే వారు నాలుగేళ్ళ ప్రొహిబిషన్ పూర్తి చేసుకొని అదనంగా రెండేళ్ళు గడుస్తున్నా వారిని పట్టించుకున్న పాపానపోవ డం లేదు. పంచాయతీలకు నూతన పాలకవర్గాలు వచ్చినా శాఖాపరమైన కార్యకలాపా లు జరగకపోవడంతో కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.