భూసార పరీక్షలతోనే పంటలకు మెరుగైన దిగుబడులు
రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన శాస్త్రవేత్త పల్లవి
సిద్దిపేట రూరల్ మార్చి 5: సిద్దిపేట: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో వెంకటాపూర్ రైతు వేదికలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సి ద్దిపేట డివిజన్ ఏడీఏ పద్మ హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ పంటల్లో ఉపయోగించాల్సిన రసాయన ఎరువుల వినియోగంపై ఆమె రైతులకు వివరించారు.వేసవికాలంలో పం ట కోత అనంతరం రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వచ్చే వానకాలం పంటలకు అవసరమైన ఎరువుల మోతాదును నిర్ణయించుకోవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త పల్లవి మాట్లాడుతూ వానకాలం పంటలు వేసే ముందు పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగపడే జనుము, జీలుగ మరియు పిల్లి పెసర వంటి పంటలను సాగు చేయడం ద్వారా నేలలో కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఇఫ్కో జిల్లా ప్రతినిధి చంద్రబాబు నాయుడు, ఏఈఓ నవ్య,గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.




