18 July, 2026 | 12:31 AM

మాలల ఉపకులాలకు నష్టం జరగకుండా రోస్టర్ విధానం సవరించాలి

18-07-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్

ముషీరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల గ్రూప్-3లోని 26 మాల ఉపకులాలకు నష్టం జరగకుండా రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బేర బాలకిషన్(బాలన్న) అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ మందల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బేర బాలకిషన్ మాట్లా డుతూ మంత్రివర్గ ఉపసంఘం మాల సంఘాలతో చర్చించి సూచనలు స్వీకరించాలని, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాల ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సమ స్య పరిష్కరించాలని కోరారు. రోస్టర్ విధానాన్ని సవరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆం దోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్,  నేతలు బత్తుల రాంప్రసాద్, గోపోజు రమేష్, తాలూకా అనిల్, మంత్రి నరసింహయ్య, మాదాసు రాహుల్ రావు, సహదేవ్, నాను, నర్మెట్ట మల్లేష్, కొల్లూరి లక్ష్మణ్, నాగేశ్వరరావు, ప్రభాకర్, సఖి గంగాధర్, బత్తుల ప్రదీప్ పాల్గొన్నారు.