18 July, 2026 | 12:30 AM

మేడ్చల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన అంజిరెడ్డి

18-07-2026 12:00 AM

మేడ్చల్ అర్బ న్, జూలై 17 (విజయక్రాంతి): మేడ్చ ల్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా బదిలీపై వచ్చిన బి అంజిరెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ సిఐగా ఇంతకు ముందు విధులు నిర్వహించిన సిఐ అద్దాని సత్యనారాయణ సిపి కార్యాలయంలో రిపోర్ట్ చేసి నట్లు వెల్లడించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి ఎస్‌ఓటి సిఐగా విధులు నిర్వహించిన సిఐ అంజిరెడ్డి బదిలీపై మేడ్చల్ సిఐగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ బి అంజిరెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు,మాజి ప్రజాప్రతినిధులు,తోటి సహచరుల సహాకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తూ నేరాల నియంత్రణకు ఎల్లవేళల కృషి చేస్తానని తెలియజేశారు.