12 May, 2026 | 11:18 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

13-03-2026 01:14 AM

రంగారెడ్డి, మార్చి 1౨(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజా పాలనప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేయడంలో ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల కోసం ఏర్పాటు చేసిన ఒకరోజు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మనకు నిర్దేశించిన 99 రోజుల పాటు 10 ప్రధానాంశాలతో ఈ ప్రణాళిక సాగుతుంది. ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ,వార్డు సభల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.

సర్పంచ్లకు విధులను, పథకాలను వివరించేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం సర్పంచ్లకు ఐడీ కార్డులు, ప్రణాళిక పుస్తకాలను పంపిణీ చేశారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ఉద్దేశమని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్ ఇతర జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.