calender_icon.png 17 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి విక్రయంలో దళారుల చేతివాటం

17-02-2026 01:06:04 AM

పత్తి సాగు చెయ్యని రైతు పేరిట పత్తి అమ్మకం

అమాయక రైతుల పేరుతో సీసీఐకి విక్రయాలు

అధికారులు విచారణ జరపాలని రైతులు డిమాండ్ 

ఆదిలాబాద్/ఉట్నూర్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): జిల్లాలోని అమాయక రైతులను ఆసరాగా చేసుకుని మధ్య దళారులు పత్తి విక్రయాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రైతుల ప్రమేయం లేకుండానే ఏటా పత్తిని విక్రయిస్తూ అక్రమ దందాకు తెర లేపుతు లక్ష లు గడుస్తున్న ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా, క్వింటాల్ పత్తికి  రూ.8,100 ధర నిర్ణయించారు.

ఈ అవకాశాన్ని మధ్య దళారులు ఆసరాగా చేసుకుని, అమాయక రైతుల పేరు తో సీసీఐకి మద్దతు ధరకు పత్తిని విక్రయిస్తున్నారు. అక్కడక్కడ రైతుల నుండి తక్కువ ధర కు కొనుగోలు చేసిన పత్తిని మరో రైతు పేరు తో  సీసీఐకి విక్రయిస్తున్నారు. కొంత మంది రైతులు పత్తి పంట సాగు చేయకున్న ఆ రైతు పేరుతో వ్యవసాయ శాఖ అధికారులను తప్పుదారి పట్టించి, రైతులు పత్తి సాగు చేసినట్లు రికార్డు సృష్టించి, వారి పేరుతో పత్తి పంటను విక్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అదిలాబాద్ రూరల్ మండలం, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, ఉట్నూర్, గాదిగూడ తదితర మండలాల్లో యదేచ్ఛగా సాగుతోంది.

పత్తి పంటలు కొనుగోలు చేసే వ్యాపారులు ఇటు రైతులను, అటు అధికారులను మోసం చేస్తూ ప్రభుత్వ మద్దతు ధరకు పత్తి విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. మరో వారం రోజుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు నిలిచిపోతాయని తెలుసుకున్న వ్యాపారులు  గ్రామాల కు వెళ్లి రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు తీసుకొని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పత్తి పంట సాగు చేసినట్టు  అధికారుల నుంచి రాసుకొని ఆన్లైన్ లో నమోదు చేసి, సీసీఐకి పత్తి విక్రయిస్తున్నారు.

కొంతమంది వ్యాపారులు మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రతో పాటు ఇతర జిల్లా ల నుండి పత్తి పంట కొనుగోలు చేసి అదిలాబాద్ జిల్లాలోని ఆయా జిన్నింగ్‌లలో అమ్ము తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని  ఆరోపణలు వస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో  మొక్కజొన్న సాగు చేసిన రైతుల పేరుతో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసా య అధికారులు ధృవీకరించడంతో వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరుకాయలు గా సాగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు విచారణలు జరిపితే అసలు వ్యవహా రం బయటకు రైతులు కోరుతున్నారు.

ఇలాంటి సంఘటన ఎన్నో... 

ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల రైతుల వద్ద కొను గోలు చేసిన పత్తి పంటను మధ్య దళారులు ఇంటికి వెళ్లి కొనుగోలు చేయడం, ఆ రైతుల పేరుతోనే ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.ఇలాంటి సంఘటనలపై జిల్లా ఉన్నతాధికారులు  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అమాయక గిరిజన రైతులు నష్టం పోకుం డా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉంది. మార్కెట్ శాఖ ద్వారా లైసెన్సులు తీసుకున్న వ్యాపారులతో పాటు ఎలాంటి లైసెన్సులు లేని వారు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అమాయక రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న పట్టించుకు నే వారు లేరని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు.

మొక్కజొన్న సాగు చేశా...

నాకు అదిలాబాద్ రూరల్ మండలం లో 7 ఎకరాలతో పాటు, నార్నూర్ మం డలంలో 5 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఏడాది హత్తిగుట్టలోని సాగు భూమి లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. నార్నూర్ మండలంలోని 5 ఎకరాలలో కంది పంట సాగు చేసాం. మొక్కజొన్న పంట సాగులో 40 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. మొక్కజొన్న పంట కొను గోలు చేసిన వ్యాపారి ఇటీవల ఇంటికి వచ్చి తన వద్ద పత్తిని సీసీఐకి అమ్మేందుకు రావాలని చెప్పాడు. వ్యాపారితో పాటు వెళ్లి సీసీఐకి వెళ్లి పత్తి విక్రయించా ను. తన బ్యాంక్ ఖాతా నెంబర్  190222040000507లో పత్తి పంట పైసలు రూ. 7.50 లక్షలు జమయ్యాయి. వ్యాపారి తన వెంట వచ్చి నా వేలిముద్ర తీసుకొని బ్యాంక్‌లో నుండి డబ్బులు తీసుకున్నాడు. తనకు రానుపోను కోసం చార్జిలిచ్చాడు అంతే.

కుడిమేత సోనేరావు, హత్తిగుట్ట, ఆదిలాబాద్ రూరల్