విజ్ఞాన వెలుగుల విప్లవ జ్యోతి
సంపతి రమేష్ :
నేడు సావిత్రిభాయి ఫూలే వర్ధంతి :
* మహిళలు చదువుకోవడం పాపమని భావించిన నాటి ఆధిపత్య కులాల వారు సావిత్రిభాయి ఫూలేను తీవ్రంగా వేధించారు. తనకు ఎన్ని అవమానాలకు ఏమాత్రం కుంగిపోకుండా, మలినమైన చీరను మార్చుకోవడానికి తన వెంట మరో చీరను తీసుకెళ్లి మరీ నిశ్చలమైన సంకల్పంతో ఆమె బాలికలకు పాఠాలు బోధించింది. బాలికలకు విద్య బోధించేందుకు వెళ్లే సమయంలో ఆమె ఆధిపత్య కులాలకు చెందిన వారి నుంచి దాడులు ఎదుర్కొ న్నది.
భారతీయ సామాజిక వ్యవస్థలో శతాబ్దాలుగా దళిత, బహుజనులతో పాటు మహిళలు విముక్తికి దూర మయ్యారు. చారిత్రకంగా శూద్ర మహిళలు కుల వ్యవస్థతో విద్యకు నోచుకోలేదు. వి ద్యపై, ఆస్తిపై హక్కులేకపోవడం, బాల్య వివా హం, సతీ వంటి క్రూరాచారం, విధవరాలైతే కఠినమైన జీవితం వంటి ఛందసభావాలు ఆధిపత్య మహిళల పాలిట శాపంగా మా రాయి. ఇవన్నీ భారతీయ మహిళల చరిత్ర లో ముద్రపడిన చేదు వాస్తవాలు.
అయితే.. ఈ కారుచీకట్ల నుంచి సమాజ మార్పు కో సం కంకణం కట్టుకున్న ఆదర్శ దంపతులు జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే. ముఖ్యంగా సావిత్రిభాయి ఫూలే మహిళా విముక్తి దీప్తిగా చరిత్రలో నిలిచింది. 19వ శతాబ్దపు అడ్డుగోడలను ఛేదించి తన భర్త జ్యోతిరావు ఫూలేకు తోడుగా నిలిచింది. ‘నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను’ అంటూ ఆమె మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు.
ఆమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయాగవ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రిభాయి ఫూలే విద్యావంతురా లయ్యేందుకు, బాలికల కోసం పాఠశాలలు నడిపేందుకు అడుగడుగునా అవాంతరాలను ఎదుర్కొంది. ఆమె వివాహ సమయా నికి అక్షరాస్యురాలు కాకపోయినప్పటికీ, భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో పొలంలో పని చేస్తూనే చదువు నేర్చుకుంది. మహిళలు చదువుకోవడం పాపమని భావించే, నాటి సమాజం ఆమెను తీవ్రంగా వేధించింది.
తనకు ఎన్ని అవమానాలకు ఏమాత్రం కుంగిపోకుండా, మలినమైన చీరను మార్చుకోవ డానికి తన వెంట మరో చీరను తీసుకెళ్లి మ రీ నిశ్చలమైన సంకల్పంతో బాలికలకు పా ఠాలు బోధించేవారు. 1848లో బాలికల కోసం పుణెలో మొట్టమొదటి పాఠశాల ప్రా రంభించింది. బాలికలకు విద్య బోధించేందు కు వెళ్లే సమయంలో ఆమె ఆధిపత్య కులాలకు చెందిన వారి నుంచి దాడులు ఎదుర్కొ న్నది. అలా ఆమె కొన్నిసార్లు రాళ్లు, చెత్త, ప శువుల పేడ దాడులను సైతం ఎదుర్కొంది.
ఫూలే దంపతుల సంస్కరణలు
సావిత్రిభాయి ఫూలే స్త్రీలను చైతన్యపరిచేందుకు 1852లో ‘మహిళా సేవ మండల్‘ సంఘాన్ని స్థాపించింది. లింగ వివక్షతకు, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని సా మాజిక అణచివేతను, మూఢత్వాన్ని పారద్రోలి ‘సత్యాన్ని‘ శోధించేందుకు 1873లో భ ర్త మహాత్మ జ్యోతిరావు ఫూలేతో కలిసి సత్యశోధక సమాజాన్ని ప్రారంభించింది. సంస్థ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, స తీ సహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది.
వితంతు పునర్వివాహల కోసం కృషి చేసింది. బాల్యంలో వైధవ్యాన్ని అనుభవించే ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించింది. గర్భిణులకు పురుళ్లు పోసింది. వితంతు స్త్రీల శిరోముండనాన్ని ఖండించింది. కొన్ని శిరోముండనలను ఆపింది. కరువు బారిన పడి అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకుంది. యశ్వంత్‌రావు అనే అనాథ బాలుడిని ఫూలే దంపతులు దత్తపుత్రుడిగా పెంచుకున్నారు.
జ్యోతిరావు ఫూలే మరణించిన్నప్పుడు సావిత్రీభాయి ఫూలే చి తికి నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. తదుపరి సత్యసోధక్ సమాజ్ బాధ్య తలను స్వీకరించింది. పుణె నగరాన్ని కరువు, ప్లేగు పట్టి పీడిస్తుండగా, బాధితులకు సేవలందించింది. ఈ క్రమంలో ఆమె కూడా ప్లేగు వ్యాధి బారినపడి 10 మార్చి 1897 లో తుది శ్వాసవిడిచింది.
సావిత్రిభాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మ హిళ ఉపాధ్యాయురాలు. గొప్ప సంఘసంస్కర్త. మహిళల హక్కుల కోసం కృషి చేసిన తొలి మహిళా విప్లవకారిణి. ఆమె ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆమె ఆశయాల ను ముందుకు నడిపించేందుకు రెండేళ్ల క్రితం తెలంగాణలో ‘ధర్మ టీచర్ యూనియ న్’ ఏర్పడింది. విద్యను ప్రజాస్వామీకరించాలని పోరాటం చేస్తున్నది.
కింది కులాల వారికి ప్రాధాన్యమేదీ?
భారతదేశంలో చారిత్రకంగా కులవ్యవస్థ, సంప్రదాయాలు, పితృస్వామ్య ఆచారాల కారణంగా మహిళలు తీవ్రమైన అణచివేత ఎదుర్కొంటున్నారు. ఫూలే దంపతుల కృషి వల్ల సమాజంలో మెల్లమెల్లగా మార్పులు వచ్చాయి. అయితే, పురుషులతో సమానం గా మహిళలకు అవకాశాలు లేవనేది మా త్రం వాస్తవం. ఆధిపత్య కులాలకు చెందిన మహిళలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అవకాశాలు ఉంటున్నాయి. దళిత, బహుజన, ఆదివాసీ మహిళలు ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నారు.
వేధింపులు చవి చూస్తున్నారు. దాడులకు, హింసకు బలవుతున్నా రు. ఇటీవల తెలంగాణలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ బీసీ కుటుంబంపై ఆధిపత్య కులాలకు చెందిన వారు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక పాప మరణించింది. ఈ కులాధిపత్యంపై ఎంతోమంది పో రాటం చేశారు. ఇప్పటికీ మహిళల పేరుతో పనిచేసే మెజారిటీ కమిషన్లు, సంస్థలు, రాజకీయ వేదికల్లో అధికంగా ఆధిపత్య కులాల కు చెందిన మహిళల ఆధిపత్యంలోనే ఉన్నా యి.
అట్టడుగు మహిళల సమస్యలు ప్రధాన చర్చలోకి రావడం లేదు. గ్రామాల్లో భూమిలేకుండా జీవిస్తున్న మహిళలు, మహిళ కూ లీలు కుల వివక్షకు గురవుతున్న మహిళల జీవితాలు ప్రధాన స్రవంతిలో కనిపించ డం లేదు. భారతదేశంలో మహిళా సాధికారత గురించి మాట్లాడితే.. అన్ని వర్గాల మ హి ళలు ఒకే పరిస్థితిలో లేరనేది అర్థమవుతుం ది.
కులం, వర్గం, ఆర్థిక స్థితి, ప్రాంతం వంటి అంశాలు మహిళల అవకాశాల నిర్ణయిస్తున్నాయి. మహిళల విముక్తి కేవలం లింగ స మానత్వంతోనే సాధ్యం కాదని, కుల ఆధిప త్యాన్ని కూడా ప్రశ్నించాల్సిందేనని స్పష్టమవుతుంది. అప్పుడే విద్య ,ఉపాధి, సంప ద రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాల లభిస్తాయి. అది సాకారమైనప్పుడే సా విత్రిభాయి ఫూలేకు అందే నిజమైన నివాళి.
వ్యాసకర్త సెల్: 79895 79428




