11 July, 2026 | 8:39 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఫలితాలు తారుమారు చేశారు!

14-02-2026 12:56 AM
  1. నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆందోళన
  2. పోలీసుల లాఠీచార్జ్

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 13: నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తర్వాత మొదటి సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 48 డివిజన్‌ల గాను కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు) 4, ఏంఐఎం 2, ఇండిపెండెంట్ 2 డివిజన్‌లలో విజయం సాధించారు. అయితే 14వ డివిజ న్ ఫలితాన్ని ముందుగా బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించి తర్వాత కాంగ్రెస్ గెలిచినట్టు ప్రకటించారని, రీ కౌటింగ్ చేయాలని బీఆర్‌ఎస్ కోరగా అందుకు అధికారులు నిరాకరించారు.

దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టిన ప్పటికీ అధికారులు అంగీకరించలేదు. కం చర్ల భూపాల్‌రెడ్డిని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన దిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిని పోలీసు వాహనాల్లో తరలించా రు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.