రామ మందిర చోరీ కేసు సీబీఐకి అప్పగించాలి
- విరాళాల నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలి
- ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆధ్వర్యంలో మౌనదీక్షలో వీహెచ్ డిమాండ్
కరీంనగర్, జూలై 11 (విజయక్రాంతి): అయోధ్య శ్రీరామమందిర భక్తుల విరాళాల ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించి న కానుకలు, విరాళాల నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా శనివారం కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రామోజీపేట, ఇల్లంతకుంట మండలంలో నిర్వహించిన ‘మౌనదీక్ష’లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వీహెచ్ మౌనదీక్షకు ముం దు మాట్లాడుతూ.. టీటీడీ కల్తీ నెయ్యి వివాదంపై కూడా సీబీఐ దర్యాప్తు చేశారని గుర్తు చేశారు.
అయోధ్య రామ మందిర విరాళాల ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విరాళాల చోరీ అంశం భక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ మౌనదీక్షలో వీహెచ్‌తోపాటు వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రావు కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.






