24 March, 2026 | 3:30 PM

క్యూనెట్ గ్రూప్ మాఫియా

24-03-2026 01:09 AM
  1. ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా మల్టీ లెవల్ మార్కెటింగ్ పేర వేల కోట్ల మోసం
  2. తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో ఏకకాలంలో సోదాలు
  3. 30 బృందాల మెరుపు దాడులు, 32 మంది అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): నిరుద్యోగులు, గృహిణు లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వేల కోట్ల రూపాయల దగాకు పాల్పడుతున్న క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ మాఫియా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చట్టవిరుద్ధమైన మనీ సర్క్యులేషన్ పథకాలను న డుపుతున్న ఈ ముఠాపై సెంట్రల్ క్రైమ్ స్టేష న్ పోలీసులు పంజా విసిరారు.

సోమవా రం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 11 మం ది మహిళలతో సహా మొత్తం 32 మంది ని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని క్యూనెట్ కార్యాలయాలపై 30 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వా ధీనం చేసుకున్నాయి.

హాం కాంగ్ కేంద్రంగా పనిచేసే క్యుఐ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఈ క్యూనెట్ గతంలో గోల్ క్వెస్ట్, బా ధితులను ఆకర్షించడానికి అత్యంత విలాసవంతమైన మార్గాలను ఎంచుకుంటుందని సీపీ వివరించారు. హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి, తా ము చేసేది ఈ కామర్స్ వ్యాపారమని నమ్మిస్తారు. కేవలం రూ.5 నుంచి 10 లక్షలు పెట్టు బడి పెడితే, రెండేళ్లలో రూ.3 నుంచి 4 కోట్లు లాభం వస్తుందని గాలిలో మేడలు కట్టిస్తా రు.

ప్రారంభంలో ఇది ఒక మల్టీ లె వల్ మా ర్కెటింగ్ లేదా బైనరీ పద్ధతి అని అస్సలు వెల్లడించకుండా, బాధితులు డబ్బు చెల్లించి న తర్వాత వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్లిస్తా రు. ఆ వస్తువులింటికి వచ్చినప్పుడు అవి కం పెనీ ఇచ్చిన బహుమతులని నమ్మిస్తూ, అ సలు పెట్టుబడిని చట్టవిరుద్ధమైన పథకాల్లోకి మార్చేస్తారని పోలీసులు గుర్తించారు.

ఐటీ ఉద్యోగులే నిందితులు.. బాధితులు

ఈ కుంభకోణంలో విచారకరమైన విష యమేమిటంటే, నిందితుల్లో అత్యధికులు వి ద్యావంతులైన ఐటీ ఉద్యోగులే ఉండటం. తోటి ఉద్యోగులను, స్నేహితులను ఈ గొలుసుకట్టు మోసంలోకి లాగి కమీషన్లకు ఆశప డటం గమనార్హం. ప్రస్తుతం నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితుల నుంచి సు మారు రూ.75 లక్షల నష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల సంఖ్య వేలల్లో ఉం డొ చ్చని, కుంభకోణం విలువ వందల కో ట్లు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సంస్థపై గతంలోనే సుప్రీంకోర్టు కఠిన వ్యా ఖ్యలు చేసిందని,ఇటువంటి బైనరీ స్కీ మ్స్ ప్రజలను వంచించే మార్గాలే తప్ప వా స్తవానికి సాధ్యం కావని సీపీ సజ్జనార్ చెప్పారు.