24 March, 2026 | 1:49 PM

8 వరకు పోలీస్ యాక్ట్ అమలు

24-03-2026 01:07 AM

సిద్దిపేట క్రైం, మార్చి 23 : ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.

బంద్ ల పేరిట బలవంతంగా వి విధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వా రిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధం ఆమలులో ఉంటుందని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.