16-02-2026 12:00:00 AM
కారేపల్లి, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కు చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, వారిని టేకులగూడెం గ్రామ సర్పంచ్ గుమ్మడి సందీప్ మరియు గ్రామ పాలకవర్గం సభ్యులు స్వగ్రామంలో కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుమ్మడి సందీప్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, టేకులగూడెం గ్రామం గుమ్మడి నరసయ్య స్వగ్రామం కావడం మా అందరికీ గర్వకారణ మనీ అటువంటి మహనీయుడు పుట్టిన ఊరిలో మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా నేటికీ సామాన్య రైతులా నిరాడంబరంగా జీవిస్తున్న ఆయన జీవనశైలి నేటి తరానికి ఆదర్శం‘ అని కొనియాడారు. కార్యక్రమంలో టేకులగూడెం ఉపసర్పంచ్ బిక్కసాని భాస్కరరావు, పాలకవర్గ సభ్యులు కృష్ణ, సుబ్బారావు, సీత, వేమూరి మిరియం, కోడెం రమణ, మూడు లలిత మరియు గ్రామ పెద్దలు పాల్గొని నరసయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు .