30 April, 2026 | 4:21 AM

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

30-04-2026 12:54 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్    

సూర్యాపేట, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాంధీ నగర్ పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు కప్పి ఉంచాలని, అదేవిధంగా ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. ఆనంతరం నవరత్న పార్ బాయిల్ రైస్ మిల్ ను ధాన్యం దిగుమతులను పరిశీలించారు.

కొనుగోలు కేంద్రల నుండి మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రలలో టెంట్, మంచినీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవ రావు, తహసీల్దార్ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.