17 May, 2026 | 4:27 AM

పేదలకు న్యాయం అందడం లేదు

17-05-2026 12:00 AM

బీజేపీపై భగ్గుమన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీజేపీ పరిపాలనలో ఉన్నతవర్గాలకు అందుతున్న న్యాయం పేద ప్రజలకు అందడం లే దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్ ఏఐటీయూసీ రాష్ట్ర కా ర్యాలయం సత్యనారాయణరెడ్డి భవన్ నుం చి వైజంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కూనంనేని సాంబశివరావు,  రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి. నరసింహ తదితరులు డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ ఆటోను తాళ్లతో లాగి, మహిళలు ఖాళీ సిలిండర్లను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు నష్టం వాటిల్లుతుందనిప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఛాయా దేవి, నగర కార్యదర్శి బి.స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, సీనియర్ నాయకురాలు పీ ప్రేమ్‌పావని, రాష్ట్ర సమితి సభ్యులు బీ వెంకటేశం, జీ చంద్రమోహన్ గౌడ్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసిం హ, మారపాక అనిల్ కుమార్ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.