10 August, 2026 | 10:13 AM

వాగ్దేవి పాఠశాలలో బోనాల సంబరాలు

10-08-2026 09:26 AM

చందుర్తి ఆగస్టు 10 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ రాజూరి సద్గుణాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి శ్లోకాలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విద్యార్థిని విద్యార్థులు అమ్మవారి మరియు పోతరాజుల వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రాజూరి స్వాతి మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, భక్తి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఒక గొప్ప పండగ, గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించడం ఈ పండుగలోని ముఖ్యమైన సాంప్రదాయం అన్నారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.