10 August, 2026 | 11:52 AM

నర్సంపేటలో టెన్షన్.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

10-08-2026 10:27 AM

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేట మున్సిపల్ అధికారుల(Narsampet Municipal Officers) వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నాయకులు ధర్నాకు దిగారు. భారత్ రాష్ట్ర సమితి దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా విగ్రహం ఏర్పాటుకు గద్దె నిర్మించారు. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అధికారులు గద్దెను కూల్చారు. గద్దెను(Peddi Sudarshan Reddy statue pedestal) కూల్చడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli Dayakar Rao), వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని(Peddi Sudarshan Reddy's statue) ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వేదికను తొలగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే జూలై 31న హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. జూలై 26న గుండె ఆగిపోవడంతో (cardiac arrest) ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మృతి పట్ల BRS అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

తాను ఒక ఆప్తమిత్రుడిని, తెలంగాణ ఉద్యమంలో ఒక నమ్మకమైన సహచరుణ్ణి కోల్పోయానని KCR(Kalvakuntla Chandrashekar Rao) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, నర్సంపేటలో ధైర్యంగా బీఆర్‌ఎస్ జెండాను నిలబెట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రకటించిన విధంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కులను కేసీఆర్ అందజేశారు.