ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
ఆళ్ళపల్లి, (విజయక్రాంతి): 32వ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో కొమరం భీమ్ చిత్రపటానికి పూల మాలలు సమర్పించి జెండాలు ఆవిష్కరించారు. ఈ మేరకు మర్కోడు పంచాయతీలో సర్పంచ్ సుతారి రమాదేవి, తునికిబండల గ్రామంలో సర్పంచ్ మోకాళ్ళ చంద్రశేఖర్ అనంతోగులో సర్పంచ్ కల్తీ వెంకటేశ్వర్లు రాయిపాడులో సర్పంచ్ ఊకే చిన పాపయ్య సుద్దరేవులో గ్రామంలో కొమరం ప్రభాకర్, మండల కేంద్రంలో ఏఈ డబ్ల్యూ సి ఎ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు జెండాను ఆవిష్కరించి కొమరం భీమ్ కి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఐక్య కార్యచరణ సమితి మండల అధ్యక్షులు పాయం రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, మాజీ ఎంపీపీ పెండకట్ల పాపారావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులపై దాడులు ఆపాలని ఐదవ షెడ్యూల్ను పటిష్టంగా అమలు చేయాలని, జల్ జంగల్ జమీన్ పై ఆదివాసుల అడవి హక్కులను కాపాడాలని, ఆదివాసుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని భూమిని దెబ్బతీసే విధానాలను తక్షణమే నిలిపివేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిర్ణయాలను తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర జేఏసీ తుమ్మ నాగరాజు, గౌరబోయిన సుబ్బారావు, గొగ్గల వినోద్ ,కొమరం వెంకటేశ్వర్లు, కొమరం సత్తెన్న , మాజీ యంపిపి పడిగ సమ్మయ్యతదితరులు పాల్గొన్నారు.






