ఉద్యమకారులకు న్యాయం చేయాలి
- లేకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం
- టీయూ వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ
ముషీరాబాద్, మే 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ను గుర్తించేందుకు వేసిన కే.కేశవరావు కమి టీ ద్వారా నిజమైన ఉద్యమకారులకు న్యా యం జరగాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక చైర్మన్ నరాల సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యమకారుల రాష్ట్ర స్థా యి సదస్సును శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వేదిక వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌ డ్ అధ్యక్షతన నిర్వహించారు. నరాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన కే. కేశవరావు కమిటీని స్వాగతిస్తున్నామన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలన్నారు. ఈ సదస్సులో వేదిక గౌరవ అధ్య క్షులు శ్రావణ బోయిన నరసయ్య, రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ప్రధాన కార్యదర్శి సైమన్, బుర్ర సోమేశ్వర్ గౌడ్, స్వాతి, నూతి తిరుపతి, స్వరూప, కళావతి, ముస్త ఫా, జనార్ధన్, రవి, సులోచన, నగేష్, జనార్ధన్, ఉమ తదితరులతో పాటు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారులు, సానుభూతిపరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.






