ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం
రైతులకు సరిపడా ఎరువులు తక్కువ ధరకే అందజేయాలి.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం.
రాష్ట్ర ప్రభుత్వం హామీలు వెంటనే అమలు చేయాలి.
ప్రజా చైతన్య యాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాషా.
ఆళ్ళపల్లి , (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. సిపిఐ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని, రాయపాడు గ్రామంలో కొమరం భీం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం మండల కేంద్రం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ విగ్రహం వద్ద సిపిఐ మండల కార్యదర్శి సమరం హనుమంతు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముత్యాల విశ్వనాథం సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరైంది కాదని, అటు కేంద్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందచేయక ఇబ్బందుల గురిచేస్తుందన్నారు. అధికమైన ధరలతో రైతును యాప్ ద్వారా ఎరువుల అందజేసే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు దుకాణాల అందించేలాగా చర్యలు తీసుకోవడం లేదని అలాగే నిత్యవసర ధరలను పెంచి సామాన్య ప్రజలను అవస్థలకు గురిచేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని హామీలతో గద్దెనెక్కి నేటికీ ఒక హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని , ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఏ గ్రామంలో చూసిన అర్హులైన ఇందిరమ్మ లబ్దాలున్నప్పటికీ ఒక దపా మాత్రమే కొన్ని ఇల్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుందని, వృద్ధులకు పెన్షన్ మూడువేల రూపాయలు అందిస్తానన్న హామీ మాటలకే పరిమితమైందని అలాగే మహాలక్ష్మి పథకం కూడా నేటికీ దాని మూసే లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడలో లేవని ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ పార్టీ ఎప్పటికీ ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటుందని, గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నటికీ కమ్యూనిస్టు పార్టీ ఉపేక్షిందని, ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రభుత్వాలు, అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం రావడం కోసమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, రేసు ఎల్లయ్య ,ఉప్పు శెట్టి రాహుల్ చంద్రగిరి శ్రీనివాస్ వీసంశెట్టి పూర్ణచంద్రరావు మున్నా లక్ష్మీ కుమారి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి , భూక్య శ్రీనివాస్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.నిమ్మల రాంబాబు ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి, ధనలక్ష్మి జిల్లా మహిళా సంఘం నాయకురాలు. కొమరం హనుమంతరావు ఆళ్లపల్లి మండల కార్యదర్శి. గొగ్గేల కృష్ణ జిల్లా సమితి సభ్యులు.వజ్జ ఉమా పెద్ద వెంకటాపురం సర్పంచ్.మండల సహాయ కార్యదర్షులునరేడ్ల రాంబాబు వజ్జా పగడయ్య షేక్ రహీం. వార్డు సభ్యులు బాయమ్మ సీత ఉమారాణిమండల నాయకులు మల్లేష్ సహదేవ్ సురేందర్ నరేష్ వెంకటేష్ సతీష్ రాజేష్ సూర్యనారాయణ మల్లేష్ రామకృష్ణ కాంతారావుతదితరులు పాల్గొన్నారు






