26 March, 2026 | 3:08 AM

రంగారెడ్డి రాజకీయ రీ-డిజైన్

26-03-2026 01:17 AM

రెండు జిల్లాలు.. రెట్టింపు స్థానాలు

రాజకీయ నిరుద్యోగులో కొత్త ఆశలు 

పునర్విభజనతో మారనున్న జిల్లా రూపురేఖలు.. 

అసెంబ్లీ స్థానాలు 8 నుంచి 17కి పెరిగే ఛాన్స్? 

‘గేమ్ ఛేంజర్’గా మారనున్న 2026 డీలిమిటేషన్!

రంగారెడ్డి, మార్చి 25(విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ వంటి రంగారెడ్డి జిల్లాలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. పెరుగుతున్న పట్టణీకర ణ, ఓటర్ల ల నేపథ్యంలో జిల్లా భౌగోళిక, రా జకీయ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. కేంద్ర ప్రభుత్వం 2026 తర్వాత చేపట్టబో యే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జిల్లాలో కొత్త శకానికి నాంది పలకబోతోంది. కేవలం అసెంబ్లీ స్థానాలే కాకుండా, జిల్లా పాలనా విభజనలోనూ విప్లవాత్మక మార్పులు రానున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతోంది.

అర్బన్ వర్సెస్ రూరల్

ప్రభుత్వం ఇప్పటికే ఫోర్త్ సిటీ   ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటంతో, రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.రంగారెడ్డి రూరల్ కింద కందు కూరు, మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల, ఆమనగల్ వంటి మండలాలతో ’ఫ్యూచర్ సిటీ’ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉం డగా రంగారెడ్డి అర్బన్ కింద ఐటీ కారిడార్ మరియు జీహెచ్‌ఎంసీ పరిధిలోని పట్టణ ప్రాంతాలతో మరో జిల్లా ఏర్పాటు కావచ్చు అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటి కే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పై ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రత్యేక కమిషనరేట్ కు శ్రీకారం చుట్టారు.

అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కొత్తవి

ప్రస్తుతం ఉన్న 8 స్థానాలకు తోడు అదనంగా మరో 8 లేదా 9 నియోజకవర్గాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది.శేరిలింగంపల్లి & రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఓటర్ల సంఖ్య భారీగా ఉండటంతో ఇక్కడ గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, రాయదు ర్గం వంటి ప్రాంతాలు కొత్త నియోజకవర్గ కేంద్రాలుగా మారవచ్చు.మహేశ్వరం నియోజకవర్గం లో బడంగ్పేట్/బాలాపూర్ మరి యు ఫ్యూచర్ సిటీ పేరుతో రెండు కొత్త స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది.ఎల్బీనగర్ & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని హయత్నగర్ కేంద్రంగా కొత్త అర్బన్ సీటు ఖాయంగా కనిపిస్తోంది.

షాద్నగర్ కు భౌగోళిక పరంగా విస్తరించడంతో ఈ స్థానం కూడా పునర్వివ్యస్తికరణ కానుంది.కల్వకుర్తి నియోజకవర్గం నుంచి విడిపోయి ఆమనగల్ కొత్త అసెంబ్లీ కేంద్రం కావాలనే దశాబ్దాల డిమాండ్ నెరవేరవచ్చు.అసంబ్లీ స్థానాలతో పాటుపాటు ఎంపీ స్థానాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానాలుగా ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిని తగ్గించి.. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు లోక్సభ స్థానాలను అదనంగా సృష్టించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇది జాతీయ రాజకీయాల్లోనూ జిల్లా ప్రాముఖ్యతను పెంచనుంది.

ఆశావహుల్లో ఉత్సాహం.. మహిళలకు పెద్దపీట!

నియోజకవర్గాల సంఖ్య పెరగనుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, జిల్లా రాజకీయాల్లో మహిళా గళం మరింత బలంగా వినిపించనుంది.2028-29 ఎన్నికల నాటికి రంగారెడ్డి జిల్లా ఒక కొత్త పొలిటికల్ హబ్గా అవతరించబోతోంది. ఈ పునర్విభజన పాత నేతల కోటలను కూల్చుతుందా లేక కొత్త నేతలకు పట్టం కడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.