సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి పోటీ చేయాలి
- కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతరులు ఎందుకు
- ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్‌ఎస్‌కు బాగా తెలుసు
- రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- నియోజకవర్గాలు పెరిగితే మా పార్టీకి లాభమే
- చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో తనపై వేరే వాళ్లు ఎందుకు రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్‌ఎస్‌కు బాగా తెలుసని, బీఆర్‌ఎస్ తప్పకుండా గోల్ కొడుతుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి తలకిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌తో సీట్లు పెరిగి, మహిళా రిజర్వేషన్ అమలైతే స్వాగతిస్తామని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్‌ఎస్ అని గుర్తుచేశారు. అసెం బ్లీ నియోజకవర్గాలు పెరగడం వల్ల బీఆర్‌ఎస్‌కు లాభమే జరుగుతుందన్నారు. బుధవారం అసెం బ్లీ లాబీలో మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్ నిర్వహించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభు త్వం వంచించిందని, అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ద్వారా తేటతెల్లమైందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అతితక్కువ నిధులు (కేవలం 2 శాతం) ఖర్చు పెట్టిన కాంగ్రె స్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందని, గ్యారెంటీలను తుంగలో తొక్కినందునే బడ్జెట్ పేపర్లు చించేశామని, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరోవారంపాటు సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు.
సభ జరుగుతున్న తీరు అస్సలు బాగా లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు 16 నోటిఫికేషన్‌లు, 16, 978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామ క పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటుందని విమర్శించారు. వెల్ఫేర్ బోర్డ్స్, కార్పొరేషన్‌లపై స్పష్టత ఇవ్వాల ని ప్రశ్నిస్తే 33 కార్పొరేషన్‌లకు, 16 కార్పొరేషన్‌లకే కార్యాలయాలు ఉన్నాయని సమాధానం ఇచ్చారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రజక ఫెడరేషన్‌కు రూ.386 కోట్లు పెట్టి రూ.కోటి, నాయీబ్రా హ్మణలకు రూ.280 కోట్లు పెట్టి రూ.30 లక్షలు, బీసీ కార్పొరేషన్‌కు రూ.1,370 కోట్లు పెట్టి రూ.6 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు పెట్టి రూ.52 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.5,403 కోట్లు పెట్టి రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మున్నూరుకాపులకు రూ.100 కోట్లు, కృష్ణ బలిజ(పూసల)లకు రూ.100 కోట్లు, ఆర్యవైశ్యలకు రూ.25 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 98 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించారని మండిపడ్డారు.




